📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కడప జిల్లా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు కొట్టం చిన్న లక్ష్మయ్య ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నివాళులు

కడప జిల్లా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు కొట్టం చిన్న లక్ష్మయ్య ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా నివాళులు

📰 Generate e-Paper Clip

కడప (ప్రజావాణి న్యూస్ జూన్ 28)జిల్లాలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావానికి తొలి అడుగు వేసిన కొట్టం చిన్న లక్ష్మయ్య ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా బద్వేల్ పట్టణంలో ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుడుగా ఉంటూ మాదిగ జాతి అభివృద్ధి కోసం మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తూ కడప జిల్లాలో ఎమ్మార్పీఎస్ ఉనికిని నలుమూలల చాటిన లక్ష్మయ్య మన దగ్గర లేకపోవడం బాధాకరమని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన నిలబడి కడప జిల్లాలో మాదిగల అభివృద్ధి కోసం ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ కృషి చేసిన కేసీ లక్ష్మయ్య ని స్మరిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన వలె ప్రతి ఒక్కరు ఎమ్మార్పీఎస్ కృషికి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు ఓ ఎస్ వి ప్రసాద్,బత్తల కూరి కేశవయ్య దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు పడిగే వెంకటరమణ పూలే అంబేడ్కర్ రాజ్యాధికా సమితి రాష్ట్ర నాయకులు ముండ్లపాటి పిచ్చయ్య తదితరు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.