📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఐఐటి ,జేఈఈ మెయిన్స్, నీట్ పేర్లతో పుస్తకాలను అమ్ముతూ విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కళాశాలల...

ఐఐటి ,జేఈఈ మెయిన్స్, నీట్ పేర్లతో పుస్తకాలను అమ్ముతూ విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి,పి.డి.ఎస్.యు

📰 Generate e-Paper Clip

కర్నూలు జూన్ 08 ప్రజావాణి జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్,ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఐఐటి జేఈఈ మెయిన్స్,నీట్ పుస్తకాల పేర్లతో అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని,తక్షణమే విద్యాశాఖ అధికారులు గుర్తింపు రద్దు చేయాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ డిమాండ్ చేశారు.సోమవారం నాడు స్థానిక కర్నూలు *కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్ -పిజిఆర్ఎస్) కార్యక్రమం జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ గారికి పి.డి.ఎస్.యు నేతలు వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా పి.డి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎండి రఫీ మాట్లాడుతూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్,ప్రైవేట్ జూనియర్ కళాశాలలు విచ్చలవిడిగా విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు అక్రమంగా పుస్తకాల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నాయని,కళాశాలలపైన గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.జూనియర్ కళాశాల యాజమాన్యాలు ఇంటర్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లి తండ్రుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నారని,ఎంసెట్,నీట్,జెఈఈలకు అనుమతి లేకున్నా ఐఐటీ,జేఈఈ మెయిన్స్,నీట్ అంటూ మోసం చేస్తున్నారని అన్నారు. అక్షరాలతో లక్షల వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కళాశాలలో అరకొర వసతులతో విద్యను బోధిస్తున్నారని అన్నారు.ఇంటర్ బోర్డు నిబంధనలుకు విరుద్ధంగా నడుస్తున్న కళాశాలలను గుర్తించి జూనియర్ కళాశాలల గుర్తింపులు రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఒకే బ్రాంచ్ అనుమతి తీసుకొని రెండు బ్రాంచ్లు నడుపుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు జిల్లా సహాయ కార్యదర్శి సోమశేఖర్,జిల్లా ఉపాధ్యక్షులు షాహీద్,జిల్లా నాయకులు మర్రిస్వామి,ఉరుకుందు,మనోహర్ పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.