📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetఉదృతం పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ -2026 నిండు జీవితానికి రెండు చుక్కలు...... మోతే మండలం లోని...

ఉదృతం పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్ -2026 నిండు జీవితానికి రెండు చుక్కలు…… మోతే మండలం లోని పలు గ్రామాలలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం విజయవంతం…….

📰 Generate e-Paper Clip

ప్రజావాణి మోతే జూన్ 28: మామిళ్లగూడెం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో నివారణ కోసం రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్‌ను అందించారు.
ఈ సందర్భంగా గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక బూత్‌లను ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేయించారు. అలాగే బూత్‌కు రాలేని చిన్నారుల కోసం ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు అందించారు.
వైద్య సిబ్బంది మాట్లాడుతూ, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది డా ||బిందు , ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ సర్పంచ్ కొరివి వీరాస్వామి నాగమణి మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.