📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, జూన్ 26: ఆశ వర్కర్ల సమస్యలపై ఘట్‌కేసర్‌లో బీ ఆర్ టీ యూ మేడ్చల్ జిల్లా ప్రతినిధి శంభు ప్రభాకర్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రాష్ట్ర ఆశ వర్కర్ల అధ్యక్షురాలు సంతోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ ఆశ వర్కర్లపై రోజురోజుకూ పెరుగుతున్న పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆశ వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించి పర్మినెంట్ చేయాలని, వారికి స్థిరమైన వేతనం (ఫిక్స్డ్ సాలరీ) అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగ విధి పత్రం (జాబ్ చార్ట్)లో పేర్కొన్న పనులు మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వ ఆరోగ్య సేవల విస్తరణలో ఆశ వర్కర్లు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి తగిన గుర్తింపు, ఉద్యోగ భద్రత మరియు వేతన సౌకర్యాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చని పక్షంలో ప్రతి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి, సుజాత, పద్మ, పుష్ప, రేచల్, భాగ్యతో పాటు పలువురు ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.