📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఅర్చకుల సంక్షేమానికి పెద్దపీట, ప్రభుత్వ నిర్ణయంపై వెల్గటూర్ మండల అర్చకుల హర్షం

అర్చకుల సంక్షేమానికి పెద్దపీట, ప్రభుత్వ నిర్ణయంపై వెల్గటూర్ మండల అర్చకుల హర్షం

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ జూన్ 09 (ప్రజావాణి):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్చకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయంపై ఉమ్మడి వెల్గటూర్ మండల డి.డి.ఎన్ అర్చకులు హర్షం వ్యక్తం చేశారు. అర్చకులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేయడంతో పాటు, ఆ కార్డు కలిగిన అర్చకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించినప్పుడు ‘శీఘ్ర దర్శనం’ కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో అర్చకులందరూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ నిర్ణయం ద్వారా తమకు దక్కిన గౌరవానికి వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి మాట్లాడుతూ.. అర్చకుల దీర్ఘకాలిక సమస్యలను గుర్తించి, వారి కుటుంబాలకు సైతం దర్శన సౌకర్యాల్లో ప్రాధాన్యత కల్పించినందుకు ముఖ్యమంత్రికి, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖకు, సంబంధిత అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది అర్చక కుటుంబాలకు ఎంతో మేలు చేస్తుందని, తమ వృత్తికి ప్రభుత్వం ఇస్తున్న గౌరవానికి ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో వెల్గటూర్ మండల పరిధిలోని డి.డి.ఎన్ అర్చకులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.