📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalఅగ్నికి ఆహుతిఐన సెలూన్ షాప్ బాధితుడికి అండగా లలిత సోమిరెడ్డి

అగ్నికి ఆహుతిఐన సెలూన్ షాప్ బాధితుడికి అండగా లలిత సోమిరెడ్డి

📰 Generate e-Paper Clip

•అగ్నికి ఆహుతిఐన సెలూన్ షాప్… బాధితుడికి అండగా లలిత సోమిరెడ్డి

*బాధితునికి ఆర్థిక సహాయం అందించిన లలిత సోమిరెడ్డి

*వారి చేతుల మీదుగా షాపు పునఃప్రారంభం

పటాన్చెరు, జూన్ 17 (ప్రజావాణి):తెల్లాపూర్ మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ లలిత సోమిరెడ్డి సామాజిక బాధ్యతను చాటుతూ అగ్నిప్రమాద బాధితుడికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎంఐజీ ఫేజ్-2 విద్యుత్ నగర్ రోడ్ నెం.15లోని గోపాల్ సెలూన్ షాప్ ఇటీవల షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా దెబ్బతినడంతో, గోపాల్‌కు అండగా నిలుస్తూ లలిత సోమిరెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గోపాల్ తిరిగి తన వ్యాపారాన్ని పునఃప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో బాధితులకు సమాజం అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
అనంతరం విద్యుత్ నగర్ రోడ్ నెం.11/12లో నూతనంగా ప్రారంభమైన మంగళి ఆంజనేయులు హెయిర్ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లలిత సోమిరెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఆంజనేయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం అభివృద్ధి చెంది మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు లచ్చిరామ్, బాబ్జి, మాజీ ఎంఐజీ జనరల్ సెక్రటరీ యాదయ్య, మాజీ ఎంపీటీసీ యాదగిరి, ఎంఐజీ డైరెక్టర్ వెంకటయ్య, మాజీ వార్డ్ మెంబర్ శ్రీశైలం, కెంసారం శ్రీధర్, మంగళి నర్సింహ, మంగళి లింగం, బాస్ రాజు తదితరులు, విద్యుత్ నగర్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
గోపాల్‌కు సంఘీభావం ప్రకటిస్తూ, లలిత సోమిరెడ్డి అందించిన ఆర్థిక సహాయాన్ని స్థానికులు అభినందించారు. ఈ కార్యక్రమం సామాజిక సేవాభావానికి నిదర్శనంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.