📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarసుందరగిరిలో మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

సుందరగిరిలో మృతుడి కుటుంబానికి బియ్యం అందజేత

📰 Generate e-Paper Clip

మన ప్రజావాణి ప్రతినిధి చిగురుమామిడి:చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన బట్టు అయిలయ్య ఇటీవల మృతిచెందడంతో గ్రామ బీఆర్ఎస్ పార్టీ వార్డు సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలిచారు. మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులకు 25 కిలోల బియ్యాన్ని అందజేసి తమ సహానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా అయిలయ్య మృతికి గల కారణాలను ఆయన కుమారులు బట్టు బిక్షపతి, బట్టు సంపత్, బట్టు శ్రీనివాస్‌లను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఇలాంటి కష్టకాలంలో పార్టీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వంతడుపుల దిలీప్ కుమార్, పెసరి రాజాకృష్ణ, పెసరి ప్రమీల-శ్రీనివాస్, మంథని ప్రియాంక-మహేందర్, కావటి మంజుల-అనిల్, కాషబోయిన రమేష్, మాజీ ఉపసర్పంచ్ జీల సంపత్, యాదవ సంఘం నాయకులు జీల చంద్రమోహన్, జీల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.