📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మెప్మా ఆధ్వర్యంలో నిరక్షరాస్యత నిర్మూలన అవగాహన సదస్సు

మెప్మా ఆధ్వర్యంలో నిరక్షరాస్యత నిర్మూలన అవగాహన సదస్సు

📰 Generate e-Paper Clip

*మెప్మా ఆధ్వర్యంలో నిరక్షరాస్యత నిర్మూలన అవగాహన సదస్సు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

శనివారం చండూర్ మున్సిపల్ ఆఫీస్ పక్కన గల పిఆర్ గెస్ట్ హౌస్ నందు మెప్మా అద్వర్యంలో “ ఉల్లాస్” (అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ అన్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమము పై నిరక్షరాస్యత మహిళలకు, వాలాంటిర్ లకు అవగాహన కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా మాట్లాడుతూ వాలంటీర్లుగా ఉపాధ్యాయులు, విద్యార్దులు, అంగన్ వాడి, ఆశా కార్యకర్తలు, ఇతరులు ఎవరైనా బొధించుటకు ముందుకు రావాలని తెలియజేయడమైనది. ప్రధానంగా చదవడం, రాయడం సులభతరమైన పద్ధతిలోనే పుస్తకాలు ఉండటం జరిగిందని, వారికీ అనుకూలమైన సమయంలోనే చదువు చెప్పగలరు అని వాలాంటిర్ లకు చెప్పడం జరిగింది. అలాగే మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చుటకు వాలంటీరీగా ముందుకు వచ్చిన వాలంటీర్లుకు అభినందనలు తెలుపుతూ ప్రధానంగా చదవడం, రాయడం నేర్పించాలని పేర్కొనటమైంది. “విద్యాదానం – మహాదానం” అని ఇంకా ఎవరైనా ముందుకు వచ్చి ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ తెలియజేయడమైంది. ఈ కార్యక్రమములో పిడి మెప్మా జి. శ్రీనివాసన్, మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, డిఎమ్సి కె. శివాజీ, మెప్మా టిఎమ్సి ఎన్. సరిత, వాలంటీర్లు, మహిళలు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.