📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు..చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి..పట్టణ సీఐ పి శ్రీను.

మాదకద్రవ్యాల జోలికి వెళ్లొద్దు..చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి..పట్టణ సీఐ పి శ్రీను.

📰 Generate e-Paper Clip

నందిగామ రూరల్,(మే21 ప్రజావాణి) ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఆదేశాల మేరకు నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో గోళ్లమూడి రుద్రవరం గ్రామంలో డ్రగ్స్ పై దండయాత్ర 2.0 భాగంగా పట్టణ సీఐ పి శ్రీను ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.డ్రగ్స్‌, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల వినియోగానికి, చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని గంజాయి మహమ్మారి చాలా సమస్యలకు కారణమవుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల అలవాటు నుంచి బయట పడేందుకు డీ-అడిక్షన్‌ సెంటర్ల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. గంజాయి రవాణా, అమ్మకాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని అరికట్టాలని పట్టణ సీఐ పి శ్రీను పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్సై మహతి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.