📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetమహిళలు, పిలల్ల భద్రతపై భోరోసా సెంటర్ సిబ్బంది అవగాహన.....

మహిళలు, పిలల్ల భద్రతపై భోరోసా సెంటర్ సిబ్బంది అవగాహన…..

📰 Generate e-Paper Clip

ప్రజావాణి మే 01: సూర్యాపేట జిల్లా,మోతే మండలం లో

మహిళలు, పిలల్ల భద్రతపై భోరోసా సెంటర్ సిబ్బంది అవగాహన.

తె కోలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఐదవ అంశం మహిళల భద్రత పిల్లల భద్రత మాదకద్రవ్యాల నిర్మూలన సందర్భంగా ఈరోజు సూర్యాపేట జిల్లా పోలీసు మహిళా భరోసా సెంటర్ సిబ్బంది జిల్లా కేంద్రంలో గల జిల్లా మోతె మండలం మావిళ్లగూడెం,విభలాపురం ,రాంపుర్ తండా గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్లతో కలిసి భరోసా బృందం వారు ప్రజలకు లైంగిక వేధింపుల కు గురి అయినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పోక్సోచట్టం గురించి ,ఏదైనా సమస్య కు గురి అయితే ఎలా సంప్రదించాలి, మొదలగు విషయాల గురించి మాట్లాడారు. అలాగే మహిళలపై వేధింపులు జరిగిన ఎలాంటి ఆకృత్యాలు జరిగినా వాటిని ఉపేక్షించకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని వేధింపులపై ఫిర్యాదు చేస్తేనే వాటిని అరికట్టవచ్చునని సూచించారు. మహిళలు విద్యార్థులు పిల్లల భద్రతలో చట్టాలు బలోపేతం చేయబడ్డాయని గుర్తు చేశారు. పిల్లల కు మంచిస్పర్శ, చెడు స్పర్శ ,ఎవరేది ఇచ్చిన తీసుకోవద్దని చెప్పాలని చెప్పడం జర్గింది. అలాగే లింగ సమానత్వం గురించి వివరించడం జర్గింది. సైబర్ క్రైం , సామాజిక మాధ్యమాల వల్ల కలిగే నష్టాల గురించి వివరించారు.Toll-free numbers 100,1098,1930 ప్రాముఖ్యత ను వివరించడం జర్గింది.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ,సర్పంచులు,ఉప సర్పంచులు , వార్డ్ మెంబర్లు భరోసా బృందం పవిత్ర, జ్యోతి,కిరణ్మై,వనజ,శృతి, ప్రమీల పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.