📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మధ్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారా... ఇక జైలుకే జగ్రత్త

మధ్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారా… ఇక జైలుకే జగ్రత్త

📰 Generate e-Paper Clip

విజయవాడ. ప్రజావాణి న్యూస్) మధ్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడిన 12 మంది వ్యక్తులకు జైలు శిక్ష విధించిన న్యాయస్థానం వారు.విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. వారి అదేశాల మేరకు ట్రాఫిక్ డి.సి.పి.శ్రీమతి షిరీన్ బేగం ఐ.పి.ఎస్.గారి పర్యవేక్షణలో పోలీస్ అధికారులు వారి వారి సిబ్బందితో ముఖ్య జంక్షన్లలో మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది.ఈ నేపథ్యంలో ది.1వ,4వ,5వ మరియు 6వ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల వారు వాహన తనిఖీలలో పట్టుబడిన 85 మంది మద్యం సేవించి వాహనములు నడిపే చోదకులను సంబంధిత న్యాయస్థానాలలో ప్రవేశపెట్టగా గౌరవ న్యాయమూర్తి గార్లు ఈ క్రింది విధంగా జైలు శిక్ష మరియు జరిమానా విధించడం జరిగింది. ఇద్దరు (2) వ్యక్తులకు ఒకొక్కరికి రెండు రోజులు చొప్పున జైలు శిక్షా. పది (10) మంది వ్యక్తులకు ఒకొక్కరికి రెండు రోజులు చొప్పున జైలు శిక్షా. 73 మందికి రూ7,40,000/- జరిమాన విధించడం జరిగింది.ప్రతి రోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసులు తెలియజేస్తున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.