📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఫాతిమా కొత్త చర్చి ప్రారంభోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ₹50,000 విరాళం అందజేసిన కడప డిసిసి...

ఫాతిమా కొత్త చర్చి ప్రారంభోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమానికి ₹50,000 విరాళం అందజేసిన కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే12) బద్వేలు నియోజకవర్గం, బద్వేలు టౌన్ ఫాతిమా నగర్‌లోని ఫాతిమా నూతన చర్చి ప్రారంభోత్సవ సందర్భంగా అన్నదాన కార్యక్రమ ఏర్పాటుకు ఉమ్మడి కడప జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు ₹50,000/- ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా కడప డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ, సమాజ సేవలో భాగంగా ధార్మిక మరియు సేవా కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్, సీమాంక్ హాస్పిటల్ డైరెక్టర్ జహంగీర్ భాష, బిజివేముల చంద్రశేఖర్ రెడ్డి మరియు ఫాతిమా చర్చి కమిటీ సభ్యులు ఓ .విజయ్ భాస్కర్, జి.దిలీప్, జి.దివాకర్, ఎల్.భాస్కర్, ఏ .సుందర్,అన్వేష్, సన్నీ , కె.విజయ్ స్థానిక నాయకులు, చర్చి నిర్వాహకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.