📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaప్రజల ప్రాణాలను తీస్తున్న ప్రాణాంతక వీధి కుక్కలను నియంత్రించాలి కాసాల

ప్రజల ప్రాణాలను తీస్తున్న ప్రాణాంతక వీధి కుక్కలను నియంత్రించాలి కాసాల

📰 Generate e-Paper Clip

ప్రజల ప్రాణాలను తీస్తున్న ప్రాణాంతక వీధి కుక్కలను నియంత్రించాలి : కాసాల

ప్రజావాణి మహబూబ్నగర్
రాష్ట్రంలో  పల్లె, పట్నం అనే తేడా లేకుండా నిత్యం ఏదో ఒకచోట వీధి కుక్కలు ప్రజలపై దాడి చేస్తూ  ప్రజల  ప్రాణాలు తీస్తున్నాయని ఇలాంటి వీధి కుక్కలని  నియంత్రించాల్సిందిగా సమాచార హక్కు చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు కాసాల వెంకట్ రెడ్డి  రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమెరకు  ఆయన  మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రి  ప్రాంగణంలో  స.హా. చైతన్య వేదిక మహబూబ్ నగర్  జిల్లా అధ్యక్షులు తిరుమల్ రెడ్డి, జడ్చర్ల డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరబాబుతో కలిసి ప్లే కార్డ్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా   మాట్లాడుతూ ఇక్కడి  జిల్లా ఆస్పత్రికి తాను గురువారం సందర్శించిన సందర్భంగా వీధి కుక్కల దాడిలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రి  ప్రాంగణంలో రోదిస్తున్న తీరు తనను  బాధించిందన్నారు.  ఈ రాష్ట్రంలో వీధి కుక్కల బారిన పడి ఎందరో  పసిపిల్లలు సైతం  తమ ప్రాణాలను వదిలారని ఆ కన్న తల్లుల రోధనలు వర్ణించలేనివని ఇంత జరుగుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేకపోవడం విచారకరమన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.