📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetప్రగతి ప్రణాళికతోనే మహిళా సంఘాల బలోపేతం మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం మున్సిపల్ వైస్...

ప్రగతి ప్రణాళికతోనే మహిళా సంఘాల బలోపేతం
మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి

📰 Generate e-Paper Clip

ప్రగతి ప్రణాళికతోనే మహిళా సంఘాల బలోపేతం..
మహిళల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..
మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి..
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు..
కోదాడ, మే 25/ ప్రజావాణి
పట్టణ ప్రాంతాల్లోని మహిళా సంఘాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లిశ్వరి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నెని వెంకటరత్నం బాబులు అన్నారు. సోమవారం ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్ ఏడవ వార్డులో  ఏర్పాటు చేసిన  స్లమ్ సమాఖ్య సర్వసభ్య సమావేశానికి వారు ముఖ్య అతిథిలుగా హాజరై మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడు లేని విధంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నదని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధి సాధించాలన్నారు.   మహిళా సమాఖ్యల బలోపేతానికి, పట్టణ పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. మెప్మా విభాగం ఆధ్వర్యంలో నేటి నుండి  30 వరకు జరగనున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కోదాడలోనే నెంబర్ వన్ స్థానంలో ఇతరులకు ఆదర్శంగా పొదుపు సంఘాలను నడుపుతున్న బాలాజీ నగర్ లీడర్లను, ఆర్పి లను శాలువా,పూల బొకేలతో ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చైతన్య నాయక్, మాజీ కౌన్సిలర్ సైదా నాయక్,మెప్మా సీఈవో వెంకన్న, ఆర్పీలు షేక్ పర్వీన్, షేక్ షాహిన్ మహిళా సంఘాల లీడర్లు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.