📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణBhadradri Kothagudemనియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన ద్యేయం ఎమ్మెల్యే జారె

నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన ద్యేయం ఎమ్మెల్యే జారె

📰 Generate e-Paper Clip

నియోజకవర్గ అభివృద్ధి నా ప్రధాన ద్యేయం :ఎమ్మెల్యే జారె



అశ్వారావుపేట,ప్రజావాణి న్యూస్ మే 11:
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో పలు శాఖల అధికారులను కలిసి నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు.ఈ సందర్భంగా పంచాయతి రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ శ్రీమతి డి. దివ్య గారిని కలిసి గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి పంచాయతీల సమస్యలు అంగన్వాడి సమస్యలు తదితర అంశాలపై వినతిపత్రాన్ని అందజేశారు.అదేవిధంగా సచివాలయంలోని ముఖ్యమంత్రి సహాయనిధి విభాగాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గంలోని అనారోగ్య బాధిత కుటుంబాల నుంచి వచ్చిన 129 దరఖాస్తులను సంబంధిత అధికారులకు అందజేశారు.అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజల సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నా అని అశ్వారావుపేట అభివృద్ధి నా ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.