📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణBhadradri Kothagudemడాక్టర్ దంపతులకు సన్మానం కార్యక్రమం

డాక్టర్ దంపతులకు సన్మానం కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*డాక్టర్ దంపతులకు  సన్మానం కార్యక్రమండాక్టర్ దంపతులకు  సన్మానం కార్యక్రమం*

*డాక్టర్ ఉదయ జ్యోతి, డాక్టర్ ప్రసాద్ లను సన్మానించిన ఛాంబర్ అఫ్ కామర్స్ చైర్మన్ కంచర్ల భాస్కరావు, మహాత్మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జల్లిపల్లి దేవరాజ్

అశ్వారావుపేట,ప్రజావాణి న్యూస్ మే 18:
అశ్వారావుపేట: ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రసాద్ – ఉదయజ్యోతి దంపతుల పెళ్లిరోజు వేడుకలు ఆత్మీయ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, స్నేహితులు, అభిమానులు దంపతులను కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కేక్ కట్ చేపించి శాలువా సత్కారం నిర్వహించారు.కార్యక్రమంలో పాల్గొన్న చాంబర్ ఆఫ్ చైర్మన్ కంచర్ల భాస్కరరావు, మహాత్మా ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ జల్లిపల్లి దేవరాజు, మద్దు సత్యనారాయణ, కే అంజనేయులు, మానేపల్లి ప్రసాద్, యశోద, రోహిణి, డాక్టర్ దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం దంపతులతో కలిసి కేక్ కట్ చేయించి ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ డాక్టర్ ప్రసాద్ – ఉదయజ్యోతి దంపతులు సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుండి సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వైద్య సేవలతో ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.దంపతులు ఇలాగే ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో నిండి మరెన్నో పెళ్లిరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఆత్మీయత, ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.