📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్టౌన్ ప్లానింగ్ విభాగం గురించి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి, సరిదిద్దుకోండి

టౌన్ ప్లానింగ్ విభాగం గురించి అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి, సరిదిద్దుకోండి

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే09) గుంటూరు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ పనితీరుపై ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి సీరియస్ రివ్యూ అనవసరంగా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించం గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై ఇటీవల అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి, వాటిని వెంటనే సరిదిద్దుకోండి అని, అనవసరంగా ప్రజలను నిబంధనల పేరుతో ఇబ్బంది కలిగిస్తే సహించమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి హెచ్చరించారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి మాట్లాడుతూ,నగర అభివృద్ధిలో టౌన్ ప్లానింగ్ శాఖ బాధ్యత చాలా కీలకమని,మంచి పనులు చేస్తే ప్రజల నుంచి ప్రశంసలు వస్తాయని, ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం సైతం ధృవీకరించిందని అన్నిటిలో బెస్ట్‌గా గుంటూరు వెస్ట్ టౌన్ ప్లానింగ్,శానిటేషన్ విభాగాల పని తీరు దారుణంగా ఉందని రిపోర్ట్ ఇచ్చారని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి పేర్కొన్నారు.తప్పులు జరిగితే విమర్శలు కూడా సహజమని అన్నారు. అందుకే మీడియాలో వచ్చిన ప్రతి వార్తను అధికారులు బాధ్యతగా తీసుకుని పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు.టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పనిచేయాలని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి సూచించారు.ప్రజలను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయొద్దని,ఫైళ్లు పెండింగ్‌లో పెట్టి వేధించే పరిస్థితులు ఉండకూడదన్నారు.“మీరు నిజాయితీగా పని చేస్తే మీకు పూర్తి సహకారం ఉంటుంది.నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిడులు ఉండవు”అని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి స్పష్టం చేశారు.ప్రజలకు వేగంగా,పారదర్శకంగా సేవలు అందించడంతో పాటు నగర అభివృద్ధికి ఆటంకం కలిగించే అక్రమాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి సూచించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.