📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaజిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించిన - జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్...

జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

📰 Generate e-Paper Clip

*జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష నిర్వహించిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్

*పెండింగ్ కేసులు లేకుండా వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలి – జిల్లా ఎస్పీ ఆదేశం*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మదకద్రవ్యాల నియంత్రణతో పాటు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందజేసే విదంగా సమర్ధవంతంగా పని చేయాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన పోక్సో, గ్రేవ్, నాన్-గ్రేవ్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతి, పెండింగ్ కేసుల స్థితి, కోర్టు విచారణలు, నేరస్తులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంపై అధికారులను అడిగి తెలుసుకుని యూఐఐ కేసుల్లో దర్యాప్తు చేసి కోర్టుల్లో చార్జ్‌షీట్‌లను సకాలంలో అధికారులు చేపట్టారు. కోర్టు అధికారులతో సమన్వయం చేసుకుంటూ సీసీ నంబర్లు పెండింగ్, వారెంట్ల అమలు, పెండింగ్ సమన్ల తక్షణ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఎండిపిఎస్ కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విదంగా పనిచేయాలని, మదకద్రవ్యాల సరఫరా, రవాణా, వినియోగంపై కట్టుదిట్టమైన నిఘా కొనసాగించాలని ఎస్పీ. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, ప్రజా ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్న యువత మదకవ్యాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రోడ్డు జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా నేషనల్ హైవేలు, స్టేట్ హైవేలు, కర కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మరింత ముమ్మరం చేయడంతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ పెంచాలని, రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసింది. దొంగతనాలు, చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాల నివారణకు రాత్రి, పగలు గ్యాస్టీలు నిర్వహించాలని, హిస్టరీ షీటర్లు, రౌడీ షీటర్ల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని తెలిపారు. ప్రాపర్టీ కేసుల్లో రికవరీ పై ప్రత్యేక దృష్టిసారించి బాధితులకు స్వాధీనం చేసుకున్న ఆస్తులను త్వరితగతిన అందజేయాలని సూచించారు. డయల్-100 కు వచ్చే ప్రతి కాల్ పై వెంటనే స్పందించి సంఘటన స్థలానికి తక్షణమే చేరుకోవాలని, బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ప్రతి కేసును బాధ్యతగా విచారణ చేయవలసి ఉంటుంది. సైబర్ నేరాల పట్ల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. బ్యాంక్ మోసాలు, ఒటిపి మోసాలు, ఫేక్ లింకులు, ఆన్‌లైన్ ఫ్రాడ్‌లపై గ్రామ స్థాయిలో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పెంచేలా ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటి ద్వారా కేసుల ఛేదన వేగవంతం అవుతుందని తెలిపారు. పోలీస్ అధికారులు ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన సేవలు అందించాలని ఎస్పీ తెలిపారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పోలీసులు పనిచేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. జిల్లాలో నేర నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ,ప్రజా భద్రత అంశాల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన పోలీస్ అందించాలని జిల్లా ఎస్పీ అధికారులను నియమించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్‌బీ డీఎస్పీ మల్లారెడ్డి, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు, దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మినారాయణ, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.