📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభి రామ స్వామి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

ఘనంగా సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభి రామ స్వామి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే13) పోరుమామిళ్ళ మండలము తిమ్మారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ చిన్న కప్పల పల్లి గ్రామము నందు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ పట్టాభి రామ స్వామి ధ్వజ మరియు సత్తెమ్మ తల్లి, పోతురాజు సమేత పోలేరమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ పవిత్ర మహోత్సవానికి చిన్న కప్పల పల్లి ఆలయ కమిటీ నిర్వాహకులు,గ్రామ పెద్దల ఆహ్వానం మేరకు, ఆలయ స్థలదాత మరియు లక్ష రూపాయలు ఆలయానికి ఇచ్చిన దాత శ్రీరామ సేవా సమితి ఫౌండేషన్ చైర్మన్ కాటసాని వెంకటరెడ్డి తదితరులు హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొనడంజరిగినది. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్. సుబ్బరామిరెడ్డి,కె.ప్రసాద్,పి.నరసింహులు, డి. బాల గురయ్య మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.