📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyకొందుర్గు మండల అధ్యక్షులుగా నియామక పత్రం అందుకున్న కొగురి పురుషోత్తం రెడ్డి

కొందుర్గు మండల అధ్యక్షులుగా నియామక పత్రం అందుకున్న కొగురి పురుషోత్తం రెడ్డి

📰 Generate e-Paper Clip

కొందుర్గు మండల అధ్యక్షులుగా నియామక పత్రం అందుకున్న కొగురి పురుషోత్తం రెడ్డి

కాంగ్రెస్ పార్టీ కొందుర్గు మండల అధ్యక్షులుగా కొగురి పురుషోత్తం రెడ్డికి నియామక పత్రాన్ని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ శంకరన్న అండతో శక్తివంతంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.

గతంలో పనిచేసిన మండల అధ్యక్షులు గత ప్రభుత్వంతో సమర్థవంతంగా పోరాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారని ఆయన ప్రశంసించారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ కొత్త అధ్యక్షులు కూడా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి షాద్‌నగర్ నియోజకవర్గానికి అధికారంలో లేని రోజుల నుంచే ఎంతో అండగా నిలిచారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందిస్తున్న సేవలు పార్టీ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తున్నాయని తెలిపారు. నూతన అధ్యక్షులను ప్రకటించేందుకు విచ్చేసినందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నూతన సారథి కొగురి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ…

కాంగ్రెస్కొందుర్గు మండల అధ్యక్షులుగా నియామక పత్రం అందుకున్న కొగురి పురుషోత్తం రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని, కార్యకర్తల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియామక పత్రం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేస్తానని హామీ ఇచ్చారు.

మండల పార్టీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని, కార్యకర్తల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని కొందుర్గు మండల పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి తెలిపారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియామక పత్రం అందుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేస్తానని హామీ ఇచ్చారు.

మండల పార్టీ అధ్యక్షుడిగా తనకు అవకాశం కల్పించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.