📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHyderabadకార్మికులే దేశ శక్తి మేడే వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం ప్రత్యేక బహుమతులు అందించి...

కార్మికులే దేశ శక్తి మేడే వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం ప్రత్యేక బహుమతులు అందించి అభినందించిన అరవింద్ నాయుడు

📰 Generate e-Paper Clip

కార్మికులే దేశ శక్తి



• మేడే వేడుకల్లో పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం..

• ప్రత్యేక బహుమతులు అందించి అభినందించిన అరవింద్ నాయుడు..

• కార్మికుల కష్టం వల్లే నగరం పరిశుభ్రంగా నిలుస్తోందని ప్రశంసలు..




బోయిన్ పల్లి, మే 1 ( ప్రజా వాణి )
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్‌లో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్, ఆదేశాల మేరకు కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు అరవింద్ కిషోర్ నాయుడు అలియాస్ సన్నీ బాండ్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి హెచ్‌ఏఎల్ పార్క్ వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక బహుమతులు అందజేసి వారి సేవలను కొనియాడారు. ప్రతిరోజూ తెల్లవారుజాము నుంచి ఎండా వాన తేడా లేకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కష్టపడుతున్న కార్మికుల సేవలు అమూల్యమని అరవింద్ కిషోర్ నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర అత్యంత కీలకం అని అన్నారు.
నగరం శుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికుల శ్రమ ఎంతో అవసరం అని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే అసలైన యోధులు వీరే, మేడే రోజు కేవలం వేడుక కాదు.. కార్మికుల త్యాగాలను గుర్తుచేసుకునే రోజు కార్మికుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని అన్నారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులకు తగిన గౌరవం, భద్రతా పరికరాలు, మెరుగైన వేతనాలు అందించాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరారు. కార్మికుల కష్టాన్ని గుర్తించకుండా సమాజం ముందుకు వెళ్లలేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మెడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ కిరణ్ గౌడ్, ఓల్డ్ బోయిన్‌పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శివ యాదవ్,  మెడ్చల్ జిల్లా కార్యదర్శి మొహమ్మద్ అక్తర్, మెడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాయపాటి హరీష్, మెడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, తరుణ్ రాజ్,
సంతోష్, ప్రమోద్ బండి విజయ్ కుమార్ అలియాస్ లడ్డు, అఖిల్ గౌడ్ రాజమోని శ్రీనివాస్ యువజన కార్యకర్తలు, సామాజిక సేవకులు, మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడే వేడుకల సందర్భంగా కార్మికుల సేవలను గుర్తిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.