📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల తీరుతుంది -- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల తీరుతుంది — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు

📰 Generate e-Paper Clip

*ఇందిరమ్మ ఇండ్లతో సొంతింటి కల తీరుతుంది — మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

చండూరు మున్సిపాలిటీ లోని 7 వ వార్డుకు చెందిన జెల్ల నాగరాజు నూతన ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశ కార్యక్రమము బుధవారం నాడు చండూరు మున్సిపాలిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పేదల సొంత ఇంటికాలను నెరవేర్చే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎన్నో కుటుంబాలకు సంతోషాన్ని అందిస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకం పేదలకు ఒక వరం లాంటిదని తెలిపారు. ఈ సందర్భంగా జెల్ల నాగరాజు దంపతులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ గృహ ప్రవేశ కార్యక్రమముకు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, మునిసిపల్ కమీషనర్ మల్లేశం, కౌన్సిల్ సభ్యులు బుషిపాక వాసు, కోడి సుష్మ వెంకన్న, తేలుకుంట్ల రాజకుమారి శేఖర్, జెల్ల ధనమ్మ శ్రీనివాసులు, కో-ఆప్షన్ సభ్యులు మొగుదాల సత్తమ్మ వెంకన్న, షేక్ సలీమా షరీఫ్, వార్డ్ ఆఫీసర్స్ జి. శ్రీరాములు, బి. సాయిరాం మరియు బిల్ కలెక్టర్ జి. రమేష్ ఐతరాజు మల్లేష్, పున్న సైదులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.