📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఆర్టీవో కార్యాలయంలో దోపిడికి బ్రేకులు లేవా.పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్టీవో ఏజెంట్లు..

ఆర్టీవో కార్యాలయంలో దోపిడికి బ్రేకులు లేవా.పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఆర్టీవో ఏజెంట్లు..

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 11) నందిగామ ఆర్టీవో కార్యాలయంలో ఏజెంట్ల హవా. ఏజెంట్ల ద్వారా అందుకుంటున్న అవినీతి సొమ్ము. ఏజెంట్ల ద్వారా ఒక్కొక్క అప్లికేషన్ కి ఒక్కొక్క రేటు నిర్ణయించి అవినీతి సొమ్ము అందుకుంటున్నారు అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ల ద్వారా ఆన్లైన్ చేపించిన అప్లికేషన్లు ఏజెంట్లే కోడ్( వాట్సాప్, చీటీలు )ద్వారా కార్యాలయంలో ఉన్న సిబ్బందితో అప్రూవల్ చేపిస్తున్నట్టు లబ్ధిదారులు చెప్పుకుంటున్నారు. ఏజెంట్లు ప్రభుత్వ సిబ్బంది ముడుపులను పంచుకుంటున్న వైనం. ఏజెంట్లు నెలవారీగా ఆర్టీవో కార్యాలయంలో ఉన్న సిబ్బందికి ముడుపులు చెల్లిస్తున్నట్లు ఏజెంట్లే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.ఇదే కార్యాలయంలో గతంలో విజయవాడలో రిజెక్ట్ అయిన లైసెన్సులను ఒక అధికారి డ్రైవర్ ద్వారా అక్కడి ఏజెంట్లు రిజెక్ట్ అయినా లైసెన్సులను నందిగామ నుండి అధిక మొత్తంలో వసూలు చేసి లైసెన్సులు మంజూరు చేసిన ఘటన. ఈ విషయంలో జిల్లా అధికారికి అనుమానం వచ్చి ఇక్కడ ఉన్నత అధికారికి సోకాస్ నోటీసు ఇవ్వడం జరిగిందని విశ్వసనీయ సమాచారం దానిపై ఎటువంటి చర్య తీసుకున్నారు లోగోట్టు పెరుమాళ్ళకి ఎరుక.లైసెన్స్ పొందడానికి వచ్చిన వ్యక్తి దగ్గర వేలిముద్ర వేయడానికి ఒక రేటు సంతకం చేయడానికి ఒక రేటు నిర్ణయించి వసూలు చేస్తున్న సిబ్బంది, లబ్ధిదారుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఎటువంటి రసీదు ఇవ్వకపోవడం గమనార్హవం ఆర్టీవో కార్యాలయానికి వెళ్ళామా గోల్మాల్. వచ్చిన వాళ్ళ దగ్గర పిండి పిప్పి చేస్తున్న కార్యాలయం సిబ్బంది. కార్యాలయంలో వెళ్లినప్పుడు మొదటిగా దర్శనమిచ్చే గోడకి అంటించిన నోటీసు.విలేకరులకి ఎటువంటి యాడ్లు ఇవ్వబడవుఅని .మరి అదే విధంగా కార్యాలయంలో అవినీతికి తావులేదు అనే నోటీసు బోర్డు ఎందుకు దర్శనం ఇవ్వడం లేదని లైసెన్స్ దారులు ప్రశ్నించుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఏజెంట్ల ప్రమేయం హరికట్టి, సామాన్య ప్రజలకు సామాన్యంగా పనులు జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని లైసెన్స్ దారులు, వాహనదారులు ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.