📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaఅర్ముడ్ రిజర్వ్డ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఎఆర్ఎస్ఐ లకు ఆర్ఎస్ఐ గా పదోన్నతి

అర్ముడ్ రిజర్వ్డ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఎఆర్ఎస్ఐ లకు ఆర్ఎస్ఐ గా పదోన్నతి

📰 Generate e-Paper Clip

*అర్ముడ్ రిజర్వ్డ్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు ఎఆర్ఎస్ఐ లకు ఆర్ఎస్ఐ గా పదోన్నతి*

*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*

నల్లగొండ జిల్లా అర్ముడ్ రిజర్వ్డ్ (ఎఆర్) విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఏఆర్‌ఎస్‌ఐలు హతిరామ్, వెంకటరాములుకు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్ఎస్ఐ)లుగా పదోన్నతి లభించిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదోన్నతి పొందిన అధికారులకు స్టార్‌లను అందజేసి అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖలో పదోన్నతులు అనేవి కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాకుండా బాధ్యతలు కూడా మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో మరింత అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, చట్ట పరిరక్షణలో న్యాయబద్ధంగా, పారదర్శకంగా వ్యవహరించాలని తెలిపారు. శాఖ ప్రతిష్టను పెంచే విధంగా సేవలు అందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షిస్తూ పదోన్నతి పొందిన అధికారులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలియజేశారు. పదోన్నతి పొందిన అధికారులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ శాఖకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐ సంతోష్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.