📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం

అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినం

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల మే 17 ప్రజావాణి  పోరుమామిళ్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నాగరాజు, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ మండలి అధికారి డాక్టర్ రవిబాబు, జిల్లా క్లస్టర్ మేనేజర్ భాస్కర్ మరియు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వత్తు ల స్మారక దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో కొవ్వొత్తులు వెలిగించి మౌనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోరుమామిళ్ల సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్య అధికార శివ కృష్ణ మాట్లాడుతూ ఎయిడ్స్ మృతుల ఆత్మ శాంతి కోసం మౌనం పాటించి నివాళులు అర్పించము . ప్రతి ఏడాది మే మూడవ ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమం లో ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు, ఆరోగ్య విద్య అధికారి సాదు వెంకటేశ్వర్లు,ఐ సి టీ సి కౌన్సిలర్ పి. సునీల్, ఐ సి టీ సి ల్యాబ్ టెక్నీషన్ శ్రవణ్ కుమార్, దిశా లింక్ వర్కర్ యస్. ఖాదర్ బాషా, హాస్పిటల్ సిబ్బంది, సచివాలయ ఏ ఎన్ ఎం లు, సి హెచ్ ఓ లు, ప్రభుత్వ ఆసుపత్రి ఏ ఎన్ ఎం లు, ఆశ లు,మరియు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.