📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్8 గంటల పని కోసం,140వ మేడేను జయప్రదం చేయండి! సిఐటియు పిలుపు!!

8 గంటల పని కోసం,140వ మేడేను జయప్రదం చేయండి! సిఐటియు పిలుపు!!

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్27) రైల్వే కోడూర్ సిఐటియు  జనరల్ బాడీ సమావేశం సోమవారం సాయంత్రం పి జాన్ ప్రసాద్,అధ్యక్షతన,కోడూరు  సిఐటియు ఆఫీసులో జరిగినది.ఈ సమావేశానికి,సిఐటియు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు,సిహెచ్ చంద్రశేఖర్,ఆర్ వెంకటేష్,ముఖ్య అతిథులకు హాజరయ్యారు.వారు మాట్లాడుతూ,అమెరికా చికాగో నగరంలో 8 గంటల పని హక్కు కోసం కార్మికుల రక్త తరుపునతో ఎర్ర జెండా అండతో,1917 రష్యాలో కార్మిక విప్లవం జయప్రదం తర్వాత,భారతదేశంలో 1926లో కార్మిక సంఘా లు పోరాడి ఎనిమిది గంటల పని హక్కును సాధించుకున్నారని,తెలిపారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం,నాలుగు లేబర్ కోడులు పేరుతో,12 పనిగంటలుకు పెంచారన్నారు.రాష్ట్ర ప్రభుత్వాలు కూడా,పెట్టుబడుదారులకు, కార్పొరేట్లకు, కొమ్ముకాస్తున్నారన్నారు.కార్మికులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వాలు నిలబడినాయని తెలిపారు.కేరళలో  వామపక్ష ప్రభుత్వాలు లేబర్ కోడులు అమలు చేయమని,ఎనిమిది గంటల పని కొనసాగిస్తామని తేల్చి చెప్పారన్నారు.140 వ మే డేస్ఫూర్తితో అమరవీరుల త్యాగాలతో సాధించిన,ఎనిమిది గంటల హక్కును కార్మిక హక్కులను కొనసాగించుకుంటావని,ప్రతిన భూనాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా,మంగంపేట ఏపీఎండీసీ, సమస్త పరిరక్షణ కోసం,మే మూడో తేదీన, సిఐటియు ఆధ్వర్యంలో,జరిగే రౌండ్ టేబుల్  సమావేశంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.సిఐటియు జిల్లా నాయకులు ఎస్ శ్రీ లక్ష్మీ మాట్లాడుతూ,పని గంటలు పెంచడం అంటే,వేతనాల తగ్గిపోవడమే అన్నారు. అంగనవాడి,ఆనిమేటర్స్,ఆశ,మధ్యాహ్న భోజనం స్కీం వర్కర్లకు, వేతనాలు పెంచకుండా,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,వెట్టి చాకరి చేయిస్తున్నాయని,కనీస వేతనాల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మేడే కార్యక్రమానికి స్కీం వర్కర్ లు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.సిఐటియు,మండల కార్యదర్శి,పి జాన్ ప్రసాద్  మాట్లాడుతూ,ఉద్యోగులు కార్మికులు,రైతులు వ్యవసాయ కార్మికులు, మే ఒకటో తేదీ, మే డే కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.యునైటెడ్ ఎలక్ట్రిసిటీ  ఎంప్లాయిస్ యూనియన్  జిల్లా నాయకులు  కనపర్తి కిరణ్  మాట్లాడుతూ,విద్యుత్ సంస్థను,ప్రవేట్ పరం చేస్తున్నారని,దీన్ని అడ్డుకొని,ఉద్యోగ భద్రత కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో,సిఐటియు ఉపాధ్యక్షులు,లింగాల యానాదయ్య సిఐటియు,ఓబులవారిపల్లి, మండల కన్వీనర్,నాగిపోగు పెంచలయ్య,కో కన్వీనర్,రాధాకుమారి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ, కాంట్రాక్ట్ వర్కర్స్ నాయకులు,సి.వేణు,అంగన్వాడి యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు,రమాదేవి,వెన్నెల,వాణి,స్వర్ణ,శంకరమ్మ,మణెమ్మ ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు,ఎస్ లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.