📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetవర్కోల్ గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహణ

వర్కోల్ గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహణ

📰 Generate e-Paper Clip

వర్కోల్ గ్రామంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహణ

బెజ్జంకి,ఏప్రిల్ 2(ప్రజావాణి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో భాగంగా ప్రత్యేక గ్రామసభ సమావేశం గురువారం మండలంలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని వరుకోలు గ్రామంలో సర్పంచ్ సుధగోని దేవరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రత్యేక అధికారిగా ఎంపీడీవో కృష్ణయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎంపీడీవో కృష్ణయ్య, సర్పంచ్ దేవరాజు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ బాబు, ఉప సర్పంచ్ ఆలేటి కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.