📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalమండలంలోని పలువురుపై అట్రాసిటీ కేసు నమోదు

మండలంలోని పలువురుపై అట్రాసిటీ కేసు నమోదు

📰 Generate e-Paper Clip

పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు.. 12 మందిపై కేసు

మండలంలోని పలువురుపై అట్రాసిటీ కేసు నమోదు


పరస్పరం ఫిర్యాదు చేసుకున్న ఇరు వర్గాలు.. 12 మందిపై కేసు


చెన్నారావుపేట ఏప్రిల్ 7 (ప్రజావాణి)


మండలంలోని అమీనాబాద్, బాపునగర్ గ్రామాల మధ్య చోటుచేసుకున్న గొడవ ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణకు సంబంధించి అమీనాబాద్ సర్పంచ్, ఉపసర్పంచ్‌తో సహా ఇరు వర్గాలకు చెందిన 12 మందిపై కేసులు నమోదైనట్లు ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు…

బాపునగర్ గ్రామానికి చెందిన అజ్మీర రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీనాబాద్ గ్రామానికి చెందిన పలువురిపై అట్రాసిటీ కేసు నమోదైంది. అమీనాబాద్ సర్పంచ్ ధారా రంజిత్, ఉపసర్పంచ్ బండి హరీష్, సింగారబోయిన కుమారస్వామి, దయ్యాల రాజు, మునుకుంట రమేష్, చీర అశోక్, మంద శ్రావణ్ తనను కులం పేరుతో దూషించి, దాడికి పాల్పడ్డారని రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఎదురు కేసు నమోదు…

మరోవైపు, అమీనాబాద్ గ్రామానికి చెందిన సింగారబోయిన కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాపునగర్ వాసులపై కూడా కేసు నమోదైంది. గొడవ విషయమై మాట్లాడడానికి వెళ్లిన తనను అడ్డుకొని, బండిని నిలిపివేసి తిట్టి కొట్టారని కుమారస్వామి పోలీసులకు తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బాపునగర్‌కు చెందిన అజ్మీర రాజు, భూక్యా రాజు, బాదావత్ గణేష్, బాదావత్ భాస్కర్, బాదావత్ రాజేందర్, అజ్మీర రాములపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై  రాజేష్ రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.