📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబెజ్జంకి మండలంలో విషాధం మాజీ ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మీ మృతి

బెజ్జంకి మండలంలో విషాధం మాజీ ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మీ మృతి

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బెజ్జంకి, ఏప్రిల్ 9(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ నల్లగొండ లక్ష్మీ హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందారు.ఈ విషాద వార్తతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది.ఈ సందర్భంగా మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా. రసమయి బాలకిషన్  తోటపల్లి గ్రామానికి చేరుకుని, ఆమె పార్ధివ దేహానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు.అనంతరం మాట్లాడుతూ,లక్ష్మీ మృతి వారి కుటుంబానికి మాత్రమే కాకుండా పార్టీకి కూడా తీరని లోటని పేర్కొన్నారు.ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అనంతరం, బెజ్జంకి మండలం వీరాపూర్ గ్రామానికి చెందిన యువకుడు మారు భాగ్యరెడ్డి ఇటీవల మృతి చెందగా, వారి తండ్రి మారు సుధాకర్ రెడ్డి ని వారి యొక్క కుటుంబ సభ్యులను డా. రసమయి బాలకిషన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,లింగల లక్ష్మన్, కనకండ్ల తిరుపతి బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.