📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyబీజేపీ నాయకులపై నమోదైన కేసు కొట్టివేసిన షాద్‌నగర్ కోర్టు

బీజేపీ నాయకులపై నమోదైన కేసు కొట్టివేసిన షాద్‌నగర్ కోర్టు

📰 Generate e-Paper Clip

బీజేపీ నాయకులపై నమోదైన కేసు కొట్టివేసిన షాద్‌నగర్ కోర్టు

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గ్ మండల కేంద్రంలో బీజేపీ నాయకులపై గత ప్రభుత్వం నమోదు చేసిన కేసును షాద్‌నగర్ కోర్టు కొట్టివేసింది. ఈ కేసు సుమారు ఐదు సంవత్సరాల పాటు కొనసాగింది.
2021 జూలై 22న నాటి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పర్యటన సందర్భంగా, కొందుర్గ్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసన ఉధృతంగా మారడంతో అప్పటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీజేపీ నాయకులపై కేసులు నమోదు చేసింది.
ఈ కేసులో A1గా పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ బోయ అశోక్, A2గా మోడ్స్ నరేందర్, A3గా షాద్‌నగర్ మున్సిపల్ కౌన్సిలర్ ప్యాట అశోక్ కుమార్, A4గా మోడ్స్ మధు, A5గా పెరుమల్ల యాదయ్య, A6గా శనమోని యాదయ్య, A7గా మోడ్స్ ఆనంద్ కుమార్, A8గా మోడ్స్ కిరణ్ కుమార్, A9గా బైకని లింగం యాదవ్‌లపై కేసులు నమోదు చేయబడ్డాయి.
పేద విద్యార్థుల కోసం జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని చేసిన ఈ పోరాటం నేపథ్యంలో నమోదైన కేసును కోర్టు కొట్టివేయడంతో బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేసులో బీజేపీ తరఫున న్యాయవాది కందుకూరి మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు.
ఇప్పటికీ కొందుర్గ్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు జరగకపోవడంతో, ఆ లక్ష్య సాధన కోసం పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నాయకులు తెలిపారు.
ఈ కేసులో నిందితులుగా ఉన్న బోయ అశోక్ ప్రస్తుతం పర్వతాపూర్ గ్రామ సర్పంచ్‌గా, ప్యాట అశోక్ కుమార్ షాద్‌నగర్ మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.