📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  

బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు  

📰 Generate e-Paper Clip

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి వెలుగులు పంచిన పార్టీ బిఆర్ఎస్

బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి

బెజ్జంకి,ఏప్రిల్27(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామానికి చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా పాకాల మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, 2001లో జలదృశ్యం వద్ద ప్రారంభమైన భారత రాష్ట్ర సమితి ప్రస్థానం 25 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విజయవంతంగా ముందుకు సాగిందన్నారు.మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నాయకత్వంలో 14 సంవత్సరాల పాటు జరిగిన ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు.అదే విధంగా, రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై పోరాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల మద్దతు పొందుతున్నామని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు నాయకత్వంలో పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.