📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSuryapetపోలీసు సిబ్బంది ఎండ తీవ్రత నుండి జాగ్రత్తలు పాటించాలి. ఎస్పి నరసింహ.

పోలీసు సిబ్బంది ఎండ తీవ్రత నుండి జాగ్రత్తలు పాటించాలి. ఎస్పి నరసింహ.

📰 Generate e-Paper Clip

*సూర్యాపేట ఏప్రిల్ 26(ప్రజావాణి*):ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి సమ్మర్ కిట్స్, హెల్మెట్ లు అందజేసి సూచనలు చేసిన ఎస్పి.ఎండాకాలం వేడి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ట్రాఫిక్ విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బంది ఎండ వేడి, కాలుష్యం వల్ల ఇబ్బందులు పడకుండా సిబ్బంది సంక్షేమంలో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయం నందు ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్స్ అందించారు. చలువ అద్దాలు, బాటిల్స్, వైట్ క్యాపులు,హెల్మెట్ అందించి సూచనలు చేశారు. ఎండకు డి హైడ్రేషన్ బారిన పడకుండా ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవాలి, మజ్జిక, ఓఅర్ఎస్ లాంటివి తీసుకోవాలని కోరారు. సిబ్బందికి ఇబ్బంది లేకుండా షిఫ్టుల వారీగా విధులు కేటాయించాలని అధికారులకు సూచించారు. పోలీసు సిబ్బంది విధులు నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి, ఎండ సమయంలో బైక్ లపై ఎక్కువ దూరం ప్రయనించవద్దు, వెంట మంచినీళ్ళ క్యానులు తీసుకెళ్ళాలి అని తెలిపినారు. సిబ్బంది ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఆర్ముడ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, ఆర్ఏస్ఐ అఖిల్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.