📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetపేకాట స్థావరంపై పోలీసుల దాడి..

పేకాట స్థావరంపై పోలీసుల దాడి..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట్ మార్కుక్, ఏప్రిల్ 14, ప్రజావాణి

పాములపర్తి శివారులో ఏప్రిల్ 14, సయంత్రం సమయంలో  అక్రమ పేకాట జరుగుతున్నట్టు వచ్చిన గోప్య సమాచారంపై జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు, మార్కుక్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాటలో నిమగ్నమైన పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అచ్చం గారి పాండురంగం, లింగాన్ని భాస్కర్, నీరుడి నాగరాజు, సాయి రెడ్డి, జితేందర్ రెడ్డి అనే వ్యక్తులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వాళ్ల వద్ద నుండి రూ. 7,200 నగదు, 3 సెల్ ఫోన్లు, అలాగే 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.