📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మెడికల్ కిట్ల పంపిణీ. - జిల్లా ఎస్పీ శ్రీ ఎల్....

ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మెడికల్ కిట్ల పంపిణీ. – జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్(ఏప్రిల్18) తిరుపతి పోలీస్ శాఖ.వేసవి ఎండల దృష్ట్యా అత్యవసర సేవల కోసం ప్రత్యేక చర్య. డ్యూటీలో ఉన్న సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం.అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం అందించేందుకు కిట్ల వినియోగం.తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం నందు ఈరోజు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మెడికల్ కిట్లను జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపిఎస్., గారు అందజేశారు. తీవ్ర వేసవి ఎండల నేపథ్యంలో రహదారులపై విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ట్రాఫిక్ సిబ్బంది ఎండలు, కాలుష్యం, దీర్ఘకాలిక విధుల్లో పనిచేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారని, వారి ఆరోగ్యం పరిరక్షణ పోలీస్ శాఖ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ఈ మెడికల్ కిట్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.అలాగే డ్యూటీలో ఉన్న సమయంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణ స్పందన కోసం ఈ కిట్లు ఉపయోగకరంగా ఉంటాయని,సిబ్బంది వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమం మరియు ఆరోగ్య భద్రతకు జిల్లా పోలీస్ శాఖ ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎస్పీ గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పి శ్రీమతి శ్రీ గీత కుమారి, సీఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.