📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetకేసీఆర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్రీడాకారులకు జెర్సీల పంపిణీ

కేసీఆర్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా క్రీడాకారులకు జెర్సీల పంపిణీ

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఏప్రిల్ 24(ప్రజావాణి )

తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలంలో క్రీడాకారులకు జెర్సీల పంపిణీ కార్యక్రమం నిర్వహించి,బీఆర్ఎస్ పార్టీ బెజ్జంకి మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన క్రికెట్ జట్టు క్రీడాకారులకు జెర్సీలు అందజేశారు.బిఆర్ ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ ముక్కిస పద్మారాజి రెడ్డి క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులు కేవలం క్రీడల్లోనే కాకుండా చదువు, ఉద్యోగం వంటి అన్ని రంగాల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. గ్రామ యువత అభివృద్ధే తమ లక్ష్యమని, క్రీడలను ప్రోత్సహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. ఏ సమస్య వచ్చినా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో క్రీడాకారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.