📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరైన కామ్రేడ్ జి....

కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరైన కామ్రేడ్ జి. అబ్దుల్ఖాదర్

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్09)బద్వేలు నియోజకవర్గంలో ప్రజానీకానికి సాగునీరు తాగునీరు అందించే బ్రహ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిందంటే,అబ్దుల్ ఖాదర్ గారి పోరాట పటిమే.నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవిత కాలాన్ని పణంగా పెట్టి కుటుంబం కంటే పార్టీయే ముఖ్యమని పనిచేసిన అరుదైన నేత అబ్దుల్ ఖాదర్ కడప జిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరైన కామ్రేడ్ జి.అబ్దుల్ఖాదర్ భారత కమ్యూనిస్టు పార్టీ కడప జిల్లా సీనియర్ నాయకులు కామెడీ అబ్దుల్ ఖాదర్ గారి సంస్మరణ సభ గురువారం ఆయన స్వగృహం దగ్గర సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అధ్యక్షతన జరిగినది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ.1936 జులై 17 వ తేదీన కలసపాడు మండలోని గౌష్ భీ,అబ్దుల్ రెహమాన్ దంపతులకు జన్మించిన జి. అబ్దుల్ ఖాదర్ గారు 1958 లో వివాహం అనంతరం పోరుమామిళ్ళకు వచ్చారు.భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భూమి కోసం,భుక్తి కోసం,విముక్తి కోసం సాధిస్తున్న వీరోచిత పోరాటాలు ఆనచివేత,దోపిడి, అంటరాని తనానికి వ్యతిరేకంగా ప్రజలకు అండగా నిలిచి కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడైన అబ్దుల్ ఖాదర్ గారు 1960 లో సిపిఐ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వీకరించి, ప్రజా సమస్యలపై స్పందిస్తూ,పేద ప్రజలకు అండగా నిలవడంతో,ఉద్యమ ప్రస్థానాన్ని మొదలు పెట్టి సిసిఐ సోరుమామిళ్ళ మండల కార్యదర్శిగా బద్వేల్ ఏరియా కార్యవర్గ సభ్యునిగా,ఏరియా కార్యదర్శిగా,జిల్లా కార్యవర్గ సభ్యునిగా,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పని చేశారు. ప్రజలు వారి పోరాటానికి గుర్తించి గ్రామ పంచాయితీ వార్డు మెంబర్,11 సంవత్సరాలు గ్రామ ఉపసర్పంచ్గా ఎన్నుకోన్నారు.ఆయన ప్రజలకు సేవచేశారు.నిత్యం కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారిన రాయలసీమ తగినంత వర్షపాతం లేక, కరువు నాతన పడుతున్న రాయలసీమ రైతాంగం నీటివెతలు, తీరాలాంటే కృష్ణా జలాలు రాయలసీమకు మళ్ళించాలని సాగిన స్త్రీ వీరోచిత పోరాటాలు అబ్దుల్ ఖాదర్ లాంటి వారి ఆలోచనలకు పదును పెట్టి కడప జిల్లా నీటి కష్టాలు భౌగోళిక పరిస్థితు లు,నీటి అవసరాలను గుర్తించి గ్రామ గ్రామానికి నీటి పారుదల ప్రాజెక్టుల అవసరాన్ని ప్రజలకు వివరించి ఉద్యమాలకు ఉసిగొల్పడంలో ప్రముఖ పాత్ర పోషించారు. గాలేరు నగరిలో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టు సాద్యం కాదన్న పాలకుల కుట్రలు, కుతంత్రాలను ఛేదిస్తూ కడప జిల్లా కలెక్టరెట్ కేంద్రంగా చేసుకొని ప్రాణాలను పణంగా పెట్టి సిపిఐ సీనియర్ నాయకుడు కామ్రేడ్ జె. వెంకట్రామిరెడ్డి (జె.వి) గారితో కలిసి అబ్దుల్ ఖాదర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. వీరి పోరాటాన్ని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గండికోట ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసారు,జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం,అధిక సంఖ్యలో అణగారిన వర్గాలు కలిగిన బద్వేల్ నియోజకవర్గంలో చెప్పుకో దగ్గ ప్రాజెక్ట్లు గానీ,పరిశ్రమలు లేక గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారని వలసలు నివారించాలంటే బద్వేలు నియోజక వర్గంలోని ప్రతి గ్రామానికి త్రాగునీరు, ప్రతీ ఎకరాకు సాగునీరు, అందించేందుకు తెలుగు గంగాలో అంతర్భాగమైన బ్రహ్మం! సాగర్ పూర్తి చేసి పోరుమామిళ్ళ బద్వేలు చెరువులకు అనుసందానం నుంచి అట్లూరు చివరి ఆయుకట్టు వరకు నీరు అందించాలని బ్రహ్మం సాగర్ నుండి పోరుమామిళ్ళ వరకు జరిగిన పది రోజుల పాదయాత్రలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మండవ వెంకటేశ్వరరావు బ్రహ్మం సాగర్ పర్యటన సందర్భముగా జరిగిన ఉద్యమంలో లాఠి చార్జీలు అరెస్ట్లు జైళ్ళ లెక్కచేయకుండా పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు.అబ్దుల్ ఖాదర్ గారి జీవితంలో ఆర్ధిక సమస్యలు,ఆరోగ్య సమస్యలు వెంటాడిన,నమ్మిన సిద్ధాంతాల కోసం ఏమాత్రం సదలకుండా అచంచలమైన విశ్వాసంతో 66 సంవత్సరరాల ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించిన నిరాడంబరతకు నిస్వార్ధానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన కామ్రేడ్ జి అబ్దుల్ ఖాదర్ గారికి జోహర్లు.అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎండి విజయ జ్యోతి మాట్లాడుతు.చిన్ననాటి నుంచి ఆయన పోరాటాలను నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి నాయకుల యొక్క ప్రోత్సాహాన్ని అనుభవాన్ని తీసుకున్నానని నిరంతరం పేదల కోసం పనిచేసే కమ్యూనిస్టు పార్టీలు జరగాలని రాబోవు రోజుల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి ఉపాధి హామీ చట్టంపై సమిష్టి పోరాట నిర్వహిస్తామని ఆమె తెలిపారు మాజీ జెడ్పిటిసి సభ్యులు నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ప్రభాకర్,ఎస్ టి యు జాతీయ నాయకులు రమణారెడ్డి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు బ్రహ్మానందరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు రామయ్య వీర శేఖర్,చంద్రశేఖర్,విజయలక్ష్మి బాల ఓబయ్య,వెంకట్రాముడు వేణుగోపాల్,బాదుల్లా ఏరియా సహాయ కార్యదర్శులు పి.వి రమణ,ఇమ్మానియేల్ మండల కార్యదర్శి రవికుమార్ జిల్లా సమితి సభ్యులు కోడూరు కేశవ పీరయ్య,అబ్దుల్ ఖాదర్ గారి కుమారులు షరీఫ్, జబ్బర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.