📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetఎల్లంపల్లిలో విద్యుత్ సమస్యలతో ప్రజల్లో భయం అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

ఎల్లంపల్లిలో విద్యుత్ సమస్యలతో ప్రజల్లో భయం అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి,ఏప్రిల్ 15 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన ఎల్లంపల్లి గ్రామంలో తీవ్ర విద్యుత్ సమస్యలు నెలకొని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.సింగిల్ ఫేజ్ లైన్‌కు త్రీఫేజ్ లైన్ కలిసిపోవడంతో అధిక వోల్టేజ్ సరఫరా జరుగుతూ, ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు చెలరేగుతున్నాయి. దీంతో ఇళ్లలోని విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోవడం, పేలిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
గ్రామంలోని ప్రాథమిక పాఠశాల సమీపంలో ఉన్న సింగిల్ ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంటలు, గట్టిగా శబ్దాలు రావడంతో అప్రమత్తమైన స్థానికులు వెంటనే సబ్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు.
ఈ సమస్య కారణంగా ఫ్యాన్లు, రైస్ కుక్కర్లు, ట్యూబ్ లైట్లు, సెల్‌ఫోన్లు, ఛార్జర్లు, ఇంటి వైరింగ్, స్విచ్‌లు వంటి పరికరాలుదెబ్బతింటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
మాల మహానాడు మండల అధ్యక్షుడు సంగెం రూపేశ్ మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. ఎప్పుడైనా పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇప్పటికైనా సమస్యను పూర్తిగా పరిష్కరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు విద్యుత్ శాఖ అధికారులను—ఏడి, ఏఈలను—డిమాండ్ చేస్తున్నారు.

లైన్మెన్ వివరణ

ఈ సమస్యపై లైన్మెన్ బామన్ల రవీందర్‌ను బెజ్జంకి మండల ప్రజావాణి రిపోర్టర్ ఫోన్ ద్వార సంప్రదించగా,వారం రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా సింగిల్ ఫేజ్ డీటీఆర్ వద్ద సమస్య ఏర్పడిందని తెలిపారు. తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టామని,అతి త్వరలోనే కొత్త  సింగల్డీ  పేస్డి డి ఆర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.