📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఎదులాబాద్‌లో మే 2న హిందూ సమ్మేళనం — ఘనంగా కరపత్రం ఆవిష్కరణ 

ఎదులాబాద్‌లో మే 2న హిందూ సమ్మేళనం — ఘనంగా కరపత్రం ఆవిష్కరణ 

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఏప్రిల్ 28 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ గ్రామంలోని ఊర హనుమాన్ దేవాలయంలో హిందూ సమ్మేళన ఆహ్వాన కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. హనుమాన్ మాల ధారణ చేసిన స్వాములు, స్థానిక హిందూ సంఘాల నాయకులు, భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ “హిందూ పులులంతా కదులుదాం… హిందూ శక్తిని చాటుదాం” అనే నినాదంతో సమ్మేళనాన్ని భారీ స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 2వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు వార్డు కార్యాలయం వద్ద జరగనున్న హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని, ఎదులాబాద్ గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమాజంలో హిందూ ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు సంప్రదాయాలు, సాంస్కృతిక విలువలను కాపాడటంలో ఇటువంటి సమ్మేళనాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఈ మేరకు కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ సమ్మేళన వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దాకూరి మోహన్ రెడ్డి, గాయరు రాజేష్, రాచకట్ల శ్రీశైలం, జవాజి శ్రీకాంత్, కాలేరు విజయ్ పాల్, శ్రీనివాస్, ఊర హనుమాన్ భక్త సమాజం స్వాములు, యువకులు, స్థానిక ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.