📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఇంద్రానగర్‌లో త్రాగునీటి సమస్యకు అంజయ్య యాదవ్ తక్షణ పరిష్కారం

ఇంద్రానగర్‌లో త్రాగునీటి సమస్యకు అంజయ్య యాదవ్ తక్షణ పరిష్కారం

📰 Generate e-Paper Clip

అధికారం లేకపోయినా అంకితభావం

అంజన్న సేవలకు మరో నిదర్శనం

ఇంద్రానగర్‌లో త్రాగునీటి సమస్యకు అంజయ్య యాదవ్ తక్షణ పరిష్కారం

జిల్లేడు చౌదరిగూడ మండలం ఇంద్రానగర్ గ్రామంలో తీవ్రంగా ఉన్న త్రాగునీటి సమస్యను గ్రామస్థులు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారి దృష్టికి తీసుకురాగానే, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండే అంజన్న వెంటనే స్పందించారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని మరోసారి నిరూపిస్తూ, ఆలస్యం చేయకుండా గ్రామంలో రెండు మంచి నీటి బోర్లు వేయించారు. ప్రజల ఇబ్బందులను స్వయంగా గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవడం అంజన్న ప్రత్యేకతగా నిలుస్తోంది. ఈ చర్యతో ఇంద్రానగర్ ప్రజలకు త్రాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించగా, గ్రామస్థులు అంజన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్, సర్పంచ్ అక్రమ్, నాయకులు శేఖర్ ఉప్పరి శీను, రాములు, కాగే మల్లేష్, ఉప్పరి వెంకటేష్, బాబు, శివరాజ, అన్వర్, బలవంత్, పెద్ద నరసింహులు, భానుచందర్, రాజు, నరేష్, యాదగిరి గౌడ్, జబ్బార్, ప్రవీణ్, వెంకటేష్, ప్రశాంత్ నర్సింలు, కుమార్ గౌడ్, శ్రీకాంత్, మహమ్మద్ ఖాన్, హన్ను, అబ్దుల్, రాహుల్ కుర్షిత్, మహేష్, తాజుద్దీన్, మహమూద్ సద్దాం, నిస్సార్, ఉస్మాన్, పొట్లశివరాజు, రఫీ తదితరులు, గ్రామస్థులు పాల్గొన్నారు.. KP

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.