📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

📰 Generate e-Paper Clip

ఆంధ్రజ్యోతి విలేకరిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

తవణంపల్లి ఏప్రిల్ 28 ప్రజావాణి: చిత్తూరు జిల్లాలోని వీ.కోటలో జరిగిన ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్ మోహన్ రెడ్డి హత్య ఘటనపై తవణంపల్లి ప్రెస్ క్లబ్ కమిటీ జర్నలిస్టులు తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు చేపట్టడం జరిగింది. అనంతరం తవణంపల్లి ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు జగన్నాథం మాట్లాడుతూ విలేకరులపై దాడులు ప్రజాస్వామ్యంపై దాడులు, నిజాలను వెలుగులోకి తీసుకొచ్చే పాత్రికేయులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అనంతరం హత్యకు పాల్పడిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. విలేకరుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఆయన కోరారు. మరియు ప్రెస్ క్లబ్ కమిటీ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో జర్నలిస్టులకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (a) ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ, నిర్భయంగా వార్తలు సేకరించే హక్కు, సమాచార హక్కు చట్టం కింద, సమాచారం పొందే హక్కు ఉన్నాయని, జర్నలిస్టులు తమ హక్కులను వృత్తిపరమైన, బాధ్యతలను బాధ్యతయుతంగా నిర్వహించడంలో చట్టం కూడా ఆశిస్తుందని అలాంటి జర్నలిస్టులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని ఇలాంటి హేయమైన చర్యలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు చేపట్టి శిక్ష విధించాలని సూచించారు. అనంతరం ఎస్ఐకి వినతి పత్రం అందజేసి హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి జగన్ మోహన్ రెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జగన్నాథం, ప్రధాన కార్యదర్శి అనంత కుమార్, ఉప కార్యదర్శి రామకుమార్, సభ్యులు గజేంద్ర, రాజ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.