📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅన్నోజిగూడలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం - ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి 

అన్నోజిగూడలో సమ్మర్ క్యాంప్ ప్రారంభం – ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి 

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్ ఏప్రిల్ 24 (ప్రజావాణి)  మేడ్చల్ జిల్లా, ఘాట్ కేసర్ సర్కిల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అన్నోజిగూడ పరిధిలో సమ్మర్ క్యాంప్ కార్యక్రమం రోజూ పాఠశాల విద్యార్థులకు (6–10 తరగతి) నిర్వహించబడుతోంది. విద్యార్థులకు ఆటలతో పాటు, మానసిక ఉల్లాసం, ఈ కార్యక్రమాల వల్ల ఉపయోగపడుతుంది.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. ప్రతాప్ రెడ్డి మరియు ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. పి ఈ టి విజయ్ కుమార్ ప్రోత్సాహంతో

ఈ సమ్మర్ క్యాంప్ మే 31 వరకు కొనసాగనుండగా, ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు చెస్, క్యారమ్స్, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్ నిర్వహిస్తున్నారు.

క్రీడా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పి ఈ టి విజయ్ కుమార్, ఉపాధ్యాయులకు విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.