📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అంబేద్కర్ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ..ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

అంబేద్కర్ గారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ..ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి

📰 Generate e-Paper Clip

వైఎస్ఆర్ కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)పోరుమామిళ్ల టౌన్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఈరోజు పోరుమామిళ్ల టౌన్ నందు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి  అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశ స్వాతంత్ర్యానికి ముందే బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కోసం పోరాడిన మహనీయుడని, ప్రజాస్వామ్యానికి బలమైన పునాది వేసి దేశాన్ని శాంతియుత మార్గంలో ముందుకు నడిపించిన గొప్ప దార్శనికుడని తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాలు యుద్ధాలు,ఘర్షణలతో బాధపడుతున్నా మన దేశం శాంతి, సామరస్యంతో ముందుకు సాగడం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలన అనంతరం తీవ్ర బీదరికంలో ఉన్న భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఆయన చూపిన మార్గం అపారమని, గత 70 సంవత్సరాల్లో దేశం సాధించిన ప్రగతి అందుకు నిదర్శనమని అన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, దళితులు ప్రజాస్వామ్యాన్ని విశ్వసించి దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడం అంబేద్కర్ గారి ఆశయాల ఫలితమని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో మనమందరం కట్టుబడి ముందుకు సాగితే త్వరలోనే భారతదేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా అవతరిస్తుందని, ప్రతి భారతీయుడు అభివృద్ధి చెందే స్వర్ణయుగం సమీపంలో ఉందని తెలిపారు. అంబేద్కర్ గారిని ఒక్కరోజే కాక ప్రతిరోజూ స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన గౌరవం చెల్లించినట్లవుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, మాజీ సర్పంచ్ రంగసముద్రం సర్పంచ్ చిత్తా రవి ప్రకాశ్ రెడ్డి, జిల్లా మరియు రాష్ట్ర అనుబంధం విభాగాల నాయకులు రాళ్లపల్లి నరసింహులు, గాజులపల్లె రవిచంద్ర రెడ్డి, చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి, చిత్తా గిరి ప్రణీత్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రుద్రవరం ప్రసాద్ షేక్ మస్తాన్, పుల్లారెడ్డి, నారాయణరెడ్డి, హుస్సేన్, చాపాటి సాయినారాయణ రెడ్డి, ముత్యాల ప్రసాదరావు, చెనరాయుడు, గుర్రప్ప,పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.