📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్యం.వి.రావ్ జాతీయ ఉగాది సేవా పురస్కారం 2026 కు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్...

యం.వి.రావ్ జాతీయ ఉగాది సేవా పురస్కారం 2026 కు ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి. యస నారాయణరెడ్డి ఎన్నిక

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన యం .వి.ఆర్ ఫౌండేషన్ వారు పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని తెలుగు రాష్ట్రాలలో వైభవంగా జరుపుకొను సందర్భంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారికి ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరిస్తున్న కార్యక్రమంలో భాగంగా గత మూడు దశాబ్దాలుగా నిరంతర సేవలు కొనసాగిస్తున్నందున ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు ప్రథమ స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫౌండేషన్ వారికి ఎం వి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు శ్రీ యం లీలామోహన్ కృష్ణ వాట్సాప్ ద్వారా పంపిన ధ్రువీకరణ పత్రము బుధవారము బి యస్ నారాయణరెడ్డి అందుకున్నారు. ఈ ఆహ్వాన పత్రికలో ఈనెల ఈనెల 15న మండల కేంద్రమైన కోట పట్నం నందు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించే సాహితీ సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొని ఉగాది పురస్కారమును స్వీకరించాల్సి ఉందని సంస్థ వ్యవస్థాపకులు లీలా కృష్ణ మోహన్ కార్యవర్గ సభ్యులు తెలిపారన్నారు స్వచ్ఛందంగా చేస్తున్న సేవలకు గాను ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా అవార్డ్స్ అందుకోవడం అలాగే నైజీరియా దేశం నుంచి డాక్టరేట్ కూడా మనం ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ చక్రవర్తి యాదవ్ ద్వారా అందుకోవడం కూడా జరిగిందన్నారు సుదూర దూరములో ఉన్న ఎన్జీవోలు మనమల్ని మనం చేస్తున్న సేవలను గుర్తించి అందించినందుకు యం వి ఆర్ ఫౌండేషన్ ఛైర్మెన్ లీలా కృష్ణ మోహన్ కి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు అదేవిధంగా ఉగాది సేవా పురస్కారం పొందుతున్నందుకు స్నేహితులు గిద్దలూరు బద్వేల్ తాలూకా ప్రజలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు అభినందనలు తెలియచేశారని బి యస్ నారాయణరెడ్డి తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.