📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetబెజ్జంకి పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలు..

బెజ్జంకి పోలీస్ స్టేషన్ లో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలు..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట జిల్లా, మార్చి 8, ప్రజావాణి

మహిళా దినోత్సవం సందర్భంగా బెజ్జంకి పోలీస్ స్టేషన్ ఎస్ ఐ బి. సౌజన్య, ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ కుటుంబంలోని మహిళలను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి వారికి పూలమాలతో సన్మానం చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ విధులు ఇతర ఉద్యోగాల కంటే ఎంతో భిన్నమైనవని, ఎల్లవేళలా ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉండటంతో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లులు భార్యలు అందించే సహకారం, సహనం ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా ఎస్ ఐ సౌజన్య, పేర్కొన్నారు.పోలీస్ సిబ్బంది పండుగలు, కుటుంబ కార్యక్రమాలు, వ్యక్తిగత అవసరాలకన్నా ముందుగా ప్రజల భద్రతను ప్రాధాన్యంగా తీసుకొని విధులు నిర్వహిస్తారని, అలాంటి సందర్భాలలో కుటుంబ సభ్యులు చూపించే అండదండలు వాళ్ల కి మరింత ధైర్యం ప్రేరణను అందిస్తాయని తెలిపారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది విధుల్లో నిబద్ధతతో పని చేయడానికి వాళ్ల కుటుంబ సభ్యుల సహకారం ఎంతో కీలకమని అన్నారు.అలాగే మహిళలు సమాజంలో పోషిస్తున్న పాత్రను కొనియాడుతూ, మహిళల భద్రత కాపాడటం పోలీస్ శాఖ యొక్క ప్రధాన బాధ్యతలలో ఒకటని తెలిపారు. మహిళలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా భయపడకుండా పోలీస్‌లను సంప్రదించాలని, పోలీస్ శాఖ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.