📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బీటెక్ స్టూడెంట్ ఓపెన్ టెన్త్ పరీక్షలు రాసిన ఘటన..

బీటెక్ స్టూడెంట్ ఓపెన్ టెన్త్ పరీక్షలు రాసిన ఘటన..

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణిన్యూస్(మార్చి26)జగ్గయ్యపేటలోఓపెన్ టెన్త్ పరీక్షల్లో భారీ అవకతవక వెలుగులోకి వచ్చింది. స్థానిక బాయ్స్ హై స్కూల్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్న ఘటన సంచలనం సృష్టించింది.వివరాల్లోకి వెళితే అసలు పరీక్ష రాయాల్సిన విద్యార్థి స్థానంలో బీటెక్ చదువుతున్న మరో వ్యక్తి హాజరై వరుసగా నాలుగు రోజులు పరీక్షలు రాసినట్లు వెల్లడైంది.చివరి రోజు నిర్వహించిన స్పెషల్ స్క్వాడ్ తనిఖీల్లో అనుమానం వ్యక్తం కావడంతో ఈ ఇంపర్సనేషన్ వ్యవహారం బయటపడింది.తనిఖీల అనంతరం పట్టుబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటనతో పరీక్షా కేంద్రంలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం తీవ్రంగా ప్రశ్నార్థకంగా మారింది.వరుసగా నాలుగు రోజుల పాటు ఒకే వ్యక్తి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్నా, ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్ గమనించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.హాల్ టికెట్, గుర్తింపు ధృవీకరణ వంటి ప్రాథమిక విధానాలు సరిగా అమలు కాలేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఇంత పెద్ద అవకతవక జరిగినప్పటికీ విషయం బయటకు రాకుండా ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను పెంచుతూ, పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.