📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ కమీషనర్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో ప్లాస్టిక్ వినియోగంపై రైడింగ్

బద్వేల్ కమీషనర్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో ప్లాస్టిక్ వినియోగంపై రైడింగ్

📰 Generate e-Paper Clip

ప్రజవాణి న్యూస్ (మర్చి15)బద్వేల్ పురపాలక సంఘం పరిధిలో ఈ రోజు మున్సిపల్ కమీషనర్ గారి ఆధ్వర్యంలో పట్టణంలో ప్లాస్టిక్ వినియోగంపై రైడింగ్ మరియు తనిఖీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీనివాసులు అనే వ్యాపారి ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ పర్యావరణానికి హాని కలిగించని బయోడిగ్రేడబుల్ వస్తువులను మాత్రమే విక్రయిస్తున్నట్లు గమనించారు.ప ర్యావరణ పరిరక్షణ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నందుకు మున్సిపల్ కమీషనర్ గారు ఆ వ్యాపారిని శాలువాతో సన్మానించి అభినందించారు.ఇతర వ్యాపారస్తులు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించి, పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇంచార్జి రమణయ్య, శానిటరీ సెక్రటరీలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.