📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం ఘనంగా ఇఫ్తార్ విందు

బద్వేల్‌లో వెల్లివిరిసిన మత సామరస్యం ఘనంగా ఇఫ్తార్ విందు

📰 Generate e-Paper Clip

ప్రజావాణి బద్వేల్ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని బద్వేల నియోజకవర్గంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ముస్లింసోదరులుభక్తిశ్రద్ధలతోపాటించేరోజాఉపవాస..దీక్షల సందర్భంగా, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మరియు బద్వేల్ టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ రితీష్ రెడ్డి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు అత్యంత వైభవంగా జరిగింది.ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ టీడీపీ యువనాయకులు భూమిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.ఐక్యతకు వేదిక కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలనే ఆకాంక్షతో నిర్వహించిన ఈ విందులో వందలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు..​ప్రార్థనలు.. ఉపవాస దీక్షలను విరమించే సమయంలో ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.యువ నాయకత్వ సందడి..ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యప్రతాప్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారితో కలిసి విందులో పాల్గొన్నారు.​ఈ సందర్భంగా యువ నాయకుడు సూర్య మాట్లాడుతూ, రంజాన్ పండుగ క్రమశిక్షణకు, దాతృత్వానికి మరియు సోదరభావానికి ప్రతీక అని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని, ఈ ఇఫ్తార్ విందు మన మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సూర్య తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.