📄 ePaper
Epaper 2
Sunday, September 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రొద్దుటూరులో..నకిలీ..మృత్యుఘోష..కాసుల కక్కుర్తితో ఊపిరితిత్తుల దహనం..

ప్రొద్దుటూరులో..నకిలీ..మృత్యుఘోష..కాసుల కక్కుర్తితో ఊపిరితిత్తుల దహనం..

📰 Generate e-Paper Clip

ప్రొద్దుటూరులో  మనిషి ప్రాణం కంటే ఆ వ్యాపారికి..నోట్ల కట్టలే..ముఖ్యం.చట్టం కళ్లుగప్పి,అధికారాన్ని అడ్డుపెట్టుకుని,సామాన్యుడి ప్రాణాలను బజారున పడేస్తున్నాడు ఆ అక్రమ సామ్రాజ్య చక్రవర్తి. ప్రొద్దుటూరు గాలిలో ఇప్పుడు స్వచ్ఛత లేదు. అంతా ఆ..నకిలీ..పొగ తెచ్చిన మృత్యు గంధమే!బ్రాండ్ పేరుతో..విషపు..విందు!ఒరిజినల్ సిగరెట్ ప్యాకెట్ రూ. 100 ఉంటే, అదే రూపంతో, అదే రంగుతో, కేవలం రూ. 20కే లభ్యమయ్యేలా నకిలీ మత్తును మార్కెట్లోకి వదులుతున్నాడు. చూడటానికి ఒరిజినల్ సిగరెట్లులా ఉండే ఆ నకిలీ సిగరెట్లు సామాన్యులు పీలుస్తూ.తమ ఊపిరితిత్తుల్లోకి నిలువునా విషాన్ని నింపుకుంటున్నారు.ఇదికేవలం వ్యాపారం కాదు,ఇది ఒక ఆర్గనైజ్డ్ మర్డర్.పథకం ప్రకారం జరుగుతున్న హత్య.ఒకవైపు ప్రభుత్వం ధూమపానం ప్రాణాంతకమని హెచ్చరిస్తుంటే, మరోవైపు ఈమృత్యు వ్యాపారి ఆ మృత్యువునుప్యాక్చేసిహోల్‌సేల్‌గాఅమ్ముతున్నాడు.రాజకీయనీడలో.కోట్లకుపడగలెత్తిన.అగ్రకుల.కేటుగాడు.బెంగళూరు, చెన్నై వంటి నగరాల నుంచి ఈ నకిలీ సరుకు కంటైనర్ల కొద్దీ ప్రొద్దుటూరుకు ప్రవహిస్తోంది. ఈ దందా వెనుక ఉన్నది గతంలో శివాజీరావు వీధిలో ఉండిన ఒక అగ్రకులానికి చెందిన పరపతి ఉన్న వ్యాపారి. గత ప్రభుత్వం హయాంలో గుట్కా నిషేధం ఉన్నప్పుడు, ఆ పార్టీలోని చోటామోటా నాయకులను అడ్డం పెట్టుకుని కోట్లాది రూపాయల అక్రమార్జన చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం మారినా, తన పంథా మార్చుకోలేదు. తన దగ్గర ఉన్న అక్రమ ధనంతో అధికారుల నోళ్లు మూయిస్తూ, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో కూడా బ్రాండెడ్ సిగరెట్ల ముసుగులో యథేచ్ఛగా దందా సాగిస్తున్నాడు. ఆ వ్యాపారి బీరువాల్లో దాగున్న ప్రతి నోటు వెనుక ఒక సామాన్యుడి ప్రాణం ఉందన్నది కాదనలేని వాస్తవం.ఖజానాకు గండి.ప్రజల ఆయువుకు చిల్లు.ఈ నకిలీ దందా వల్ల ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులు అన్నీ ఆ వ్యాపారి జేబుల్లోకి వెళ్తున్నాయి. కోట్లాది రూపాయల ట్యాక్స్ ఎగవేత జరుగుతుంటే నిఘా వర్గాలునిద్రపోతున్నాయలేకఆవ్యాపారిఇచ్చేఆమ్యమ్యాలకులోబడ్డాయా.అనేఅనుమానాలువ్యక్తమవుతున్నాయి.బ్రాండెడ్ సిగరెట్ల కంపెనీలకు సైతం తెలియకుండా జరుగుతున్న ఈ వ్యవహారం, ప్రొద్దుటూరును ఒక *నకిలీల సిగరెట్ల గడ్డ*గా మార్చేస్తోంది.ఇకనైనా చర్యలు తీసుకోరా.మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతూ, విషపూరితమైన పొగను అమ్ముతున్న ఈ మృత్యు వ్యాపారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ అక్రమ సామ్రాజ్యాన్ని కూల్చి, ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. అధికారులారా మేల్కోండి.. ఆ విషపు పొగ మీ ఇళ్ల వరకు చేరకముందే ఈ దందాను అరికట్టండి..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.