📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రైవేట్ విద్యాసంస్థలకు తొత్తుగా మారిన మండల విద్యాశాఖ అధికారి వెంకయ్య పై విచారణ జరిపి సస్పెండ్...

ప్రైవేట్ విద్యాసంస్థలకు తొత్తుగా మారిన మండల విద్యాశాఖ అధికారి వెంకయ్య పై విచారణ జరిపి సస్పెండ్ చేయాలి

📰 Generate e-Paper Clip

ప్రజావాణి : పోరుమామిళ్ల మండలంలోని ప్రైవేట్ విద్యా సంస్థలకు అమ్ముడుపోయిన మండల విద్యా శాఖ అధికారిపై (ఎంఈఓ ) వెంకటయ్య పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అన్నారు.పోరుమామిళ్లలో శుక్రవారం ఎస్.ఎఫ్. ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి మాట్లాడుతూ.చదువు పేరుతో పోరుమామిళ్ల మండలంలోని పుట్ట గొడుగులాగా ప్రవేట్ పాఠశాలలకు ప్రభుత్వ అనుమతులు లేకుండా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న మండల విద్యాశాఖ అధికారి వెంకటయ్య పై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్.ఎఫ్.ఐ ఆధ్వర్యంలో ఎన్నిసార్లు చెప్పినా చూసి చూడనట్టు వదిలేయడం దుర్మార్గం అన్నారు. ప్రైవేట్ యాజమాన్యానికి ఎంఈఓ గారు అమ్ముడుపోయారు. పళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. చదువు పేరుతో మోసం చేసే వారికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఒక మండల అధికారిగా ఉంటూ వారికి అమ్ముడు పోయారు అన్నారు. ఈ విధంగా ప్రవర్తించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎక్కడ ఎక్కడ పనిచేశారో అప్పటినుంచి కూడా అవినీతి అక్రమాలపై విచారణ జరపాలి అన్నారు. ఒక మండలానికి ఉన్నత బాధ్యతలో ఉంటూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్న ఎంఈఓ వెంకటయ్య పై చర్యలు తీసుకోవాలి అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు కౌసిక్, మండల నాయకులు ప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.