📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రజా సమస్యలపై దృష్టి – ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ప్రజా సమస్యలపై దృష్టి – ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

📰 Generate e-Paper Clip

మైదుకూరు ప్రజావాణిన్యూస్(మార్చి25)నియోజకవర్గంలోని CVAPU కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో’కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే గారికి అర్జీ రూపంలో అందజేశారు. ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించిన ఎమ్మెల్యే గారు సంబంధిత శాఖల అధికారులతో చర్చించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడం తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గారు తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ విజన్ ఆఫీసర్ వినోద్ కుమార్ పువ్వాడి, మైదుకూరు ఎంపీడీవో కేవీ శ్రీధర్ నాయుడు, సంబంధిత శాఖల అధికారులు, విజన్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.